Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రంగంలోకి దిగుతోన్న అఖిల్ .. హీరోయిన్ కోసం అన్వేషణ

  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్
  •  ఈ నెల 26వ తేదీన షూటింగ్ మొదలు
  • త్వరలోనే కథానాయిక ఎంపిక 
అఖిల్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు అవసరమైన సన్నాహాలను చేస్తున్నారు.

ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు  .. హీరోయిన్ ను ఖరారు చేయలేదు. ఈ రెండు విషయాలకి సంబంధించిన ప్రకటన కోసమే అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో, అందుకు తగిన టైటిల్ ను గురించిన ఆలోచన చేస్తున్నారట. ఇక కథానాయికగా సాధ్యమైనంత వరకూ కొత్తమ్మాయిని రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నారట. 
akhil

More Telugu News